నిర్మల్‌చైన్‌గేట్: సీఎంఆర్ డెలివరీని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. డెలివరీలో వెనుకబడిన మిల్లర్లు, ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. మిల్లులకు సంబంధించిన అన్ని రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సీఎంఆర్ ప్రక్రియలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల ద్వారా తరలించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, రైస్ మిల్ల ర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


