ప్రజావాణికి భారీగా దరఖాస్తులు స్వయంగా అర్జీలు స్వీకరించిన భవేశ్‌మిశ్రా దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఆదేశం
కబ్జా నుంచి కాపాడాలి
నిర్మల్‌చైన్‌గేట్: కొత్త కలెక్టర్‌పై కోటి ఆశలతో జిల్లా వాసులు సోమవారం ప్రజావాణికి తరలివచ్చారు. ఇటీవలే భవేశ్‌మిశ్రా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత వారం సీఎంతో మీటింగ్ ఉండడంతో ప్రజావాణికి రాలేదు. ఈ వారం స్వయంగా ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యలను ఓపికగా విన్నారు. పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించారు. ఇక డివిజన్ల వారీగా ప్రజావాణి సోమవారం ప్రారంభమైంది. నిర్మల్ ఆర్డీవో, భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ ప్రజావాణి నిర్వహించారు. జన గణనలో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫ్ ఎన్యుమరేషన్ వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అధికారులు తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాకు కుంటాల మండలం సూర్యాపూర్ గ్రామంలో 1/ఆ సర్వే నంబర్ లో 3 గుంటల భూమి ఉంది. రెండేళ్ల క్రితం మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఈ స్థలంలో రేకుల షెడ్డు వేసి ఆక్రమించుకున్నారు. స్థానిక ఎమ్మార్వో కు ఫిర్యాదు చేసినా చర్య తీసుకోలేదు. – తానూరు పోసాని


