నిర్మల్‌చైన్‌గేట్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణకుమార్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి, కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్టంలో అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాలలో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులకు వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. కలెక్టర్ భవేశ్‌మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిర్ణీత సమయానికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, డీఆర్డీవో విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.


