చల్లగా శిక్షణ | - | Sakshi
Sakshi News home page

చల్లగా శిక్షణ

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. మండే ఎండల మధ్య కూడా ప్రభుత్వ జనగణన ప్రక్రియ కోసం ఎంపిక చేసిన ఎన్యుమరేటర్లకు తుదివిడత శిక్షణ నిర్వహిస్తోంది. నిర్మల్‌ రూరల్‌, సోన్‌, మామడ, నర్సాపూర్‌(జి), ఖానాపూర్‌ మండలాల్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది. మండే ఎండలు, ఉక్కపోత కారణంగా శిక్షణకు హాజరవుతున్న సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో మండలాల సెన్సెస్‌ చార్జ్‌ ఆఫీసర్లు శిక్షణా కేంద్రాల్లో ఇలా కూలర్లు ఏర్పాటు చేయించారు. బుధవారం వరకు శిక్షణ కొనసాగుతుంది. ఈనెల 11 నుంచి జూన్‌ 9 వరకు గృహజాబితా తయారీ, సమాచార సేకరణ నిర్వహిస్తారు. – నిర్మల్‌ఖిల్లా

Advertisement
 
Advertisement
Advertisement