కడెం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్ అన్నారు. ఆదివారం మండలంలోని కొండుకూర్‌లో గ్రామ సర్పంచ్ మామిడిపెల్లి భీమేశ్‌తో కలిసి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మల్లేశ్, ఉపసర్పంచ్ పొద్దుటూరి సంపత్‌రెడ్డి, ఏపీఎం గంగాధర్, కళ్లెం తిరుపతిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికె మల్లేశ్‌యాదవ్, సీసీ మల్యాల స్వామి, రైతులు మొండేశ్, భూమన్న, బానయ్య తదితరులున్నారు.


