నియోజకవర్గంలో విద్య, వైద్యంపైనే ప్రత్యేక దృష్టి సారించాను. ఎమ్మెల్యేగా గెలుపొందాక మన ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. వెనువెంటనే కేంద్రంతో చర్చించి బాసరలో స్థలాన్ని పరిశీలించాం. గత ఏడాది కేంద్రీయ విద్యాలయం కమిషనర్ డా.ముంజునాథం బాసర వచ్చారు. అప్పటి కలెక్టర్, రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వచ్చే ఏడాది తరగతులు ప్రారంభించేలా చూస్తాం. – పవార్ రామారావు పటేల్,
ముధోల్ ఎమ్మెల్యే


