భైంసాటౌన్: జిల్లాలో రబీ సీజన్ ధాన్యం సేకరణకు కొర్రీలు పెడుతున్నారు. నిబంధనలు అడ్డంకిగా మారాయి. గతంలో తప్పతాలు తీయకుండానే ధాన్యం సేకరించారని, ఈసారి మాత్రం కొనుగోలుకు కొర్రీలు పెడుతూ జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇది వరకు 40 కిలోల సంచికి రైతులు 41.5 నుంచి 42 కిలోల వరకు ఇచ్చేవారు. కానీ, ఈసారి జల్లెడ పట్టి ఇవ్వాలంటున్నారు. దీంతో అది సాధ్యం కాదని రైతులు వాపోతున్నారు. తప్పతాలు పేరుతో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై మండిపడుతున్నారు. అకాల వర్షాలు పడితే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీఫాల్ట్‌తోనే తంటాలు..
జిల్లాలో ఈ రబీ సీజన్‌లో 1.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈసారి సేకరించిన ధాన్యం పూర్తిస్థాయిలో రైస్‌మిల్లులకు కేటాయించే పరిస్థితి లేదు. గత సీజన్లలో అధికారులు రైస్‌మిల్లర్లతో లాలూచి పడి ఇష్టారీతిన ధాన్యం కేటాయించారు. సీఎంఆర్ పూర్తి చేయకపోవడం, కొందరు రైస్‌మిల్లర్లు ధాన్యం పక్కదారి పట్టించడంతో సీఎంఆర్ ప్రక్రియలో రాష్ట్రంలోనే జిల్లా పేరు అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇటీవల బాసరకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో సీఎంఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈసారి డీఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం కేటాయించొద్దని నిర్ణయించినట్లు సమాచారం. మిగిలిన మిల్లులు సైతం బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో సేకరించిన ధాన్యం ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేయడం, లేదా ఇతర జిల్లాలకు తరలించడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ధాన్యం కొనాలని రైతుల ధర్నా
నిబంధనల మేరకే సేకరణ..
జిల్లాలో రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రారంభించాం. జిల్లావ్యాప్తంగా 295 కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులు తప్పతాలు తీసిన ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. ఽ1.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశాం. డీఫాల్ట్ రైస్‌మిల్లర్లకు ధాన్యం కేటాయించేది లేదు. బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినవారికే ధాన్యం కేటాయిస్తాం. సేకరించిన ధాన్యం నిల్వ చేసేందుకు 33 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు గుర్తించాం. మిగిలిన ధాన్యం పెద్దపల్లి జిల్లాకు కేటాయిస్తాం.
– రాజేందర్, డీసీఎస్‌వో
మామడ: వరిధాన్యం కొనుగోలు చేయాలని కమల్‌కోట్, ఆదర్శనగర్, టెంబుర్ని గ్రామాల రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఽఆదివారం ధర్నా చేశారు. ధాన్యం చేతికివచ్చి 20 రోజులైనా కొనుగోళ్లు ప్రారంభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పతాలు పేరుతో యంత్రంతో శుద్ధి చేయాలని కొనుగోలు చేసేవారు ఇ బ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వి షయం తెలుసకున్న అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, సీఐ గోవర్ద న్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యలు లేకుండా ధాన్యం కొ నుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని తె లుపడంతో రైతులు ఆందోళన విమరించారు.


