ఇటర్న్‌షిప్‌ ఎంచుకో.. నైపుణ్యం పెంచుకో.. | - | Sakshi
Sakshi News home page

ఇటర్న్‌షిప్‌ ఎంచుకో.. నైపుణ్యం పెంచుకో..

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

● నిరుద్యోగులకు కేంద్ర పథకం.. ● 6 నుంచి 9 నెలల కాలపరిమితి ● ప్రతీనెల రూ.9 వేల భృతి

రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వెంటనే రూ.6 వేలు

నిర్మల్‌చైన్‌గేట్‌: నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంచేందుకు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న నిరుద్యోగులకు బంగారు భవిష్యత్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తుంది. అనేక కంపెనీలు పీఎం ఇంటర్న్‌షిప్‌లో అందుబాటులో ఉంటాయి. నిరుద్యోగులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తరువాత 6 నుంచి 9 నెలల్లో ఆయా కంపెనీలు నిరుద్యోగులకు ఇటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తాయి. గతనెల 1 నుంచి ప్రారంభమైన ఈ స్కీంలో వేలాది మంది నిరుద్యోగులు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

10 నుంచి పీజీ వరకు..

పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన వారు పీఎం ఇంటర్న్‌షిప్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా కంపెనీలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల అర్హతను బట్టి ఆయా కంపెనీలు ఆఫర్‌ ఇస్తాయి. ఇంటర్న్‌షిప్‌ పూర్తయిన తర్వాత మంచి ప్రదర్శన కనబరిస్తే, అదే కంపెనీలో పర్మినెంట్‌ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

18 నుంచి 25 ఏళ్లలోపు..

అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, వార్షిక ఆదా యం రూ.12 లక్షల కంటే ఎక్కువ ఉంటే అనర్హులు. కంపెనీలు పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇటర్న్‌షిప్‌ సమయంలో ప్రమాద బీమా కూడా ఉంటుంది. కొన్ని కంపెనీలు టీఏ, డీఏలు అదనంగా చెల్లిస్తాయి. 50 శాతం హాజరుంటే సర్టిఫికెట్‌ కూడా ఇస్తాయి. ఆ సర్టిఫికెట్స్‌తో, ఇతర కంపెనీలో అవకాశం పొందవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement