నేటి నుంచి డివిజన్‌స్థాయిలో ‘ప్రజావాణి’ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డివిజన్‌స్థాయిలో ‘ప్రజావాణి’

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఇకపై డివిజన్‌ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు. సోమవారం నుంచి నిర్మల్‌ ఆర్డీఓ, భైంసా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజావాణితోపాటు, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డివిజన్‌స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని వివరించారు. జిల్లా కేంద్రానికి రాలేని మారుమూల గ్రామాల ప్రజలు తమ సమస్యలను స్థానికంగానే విన్నవించుకునే అవకాశం కల్పించామన్నారు. అందిన ప్రతీ అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement