మండుటెండలో చల్లని సేవ | - | Sakshi
Sakshi News home page

మండుటెండలో చల్లని సేవ

May 3 2026 8:05 AM | Updated on May 3 2026 8:05 AM

● దాహం తీరుస్తున్న దాతలు ● ఉచితంగా తాగునీరు, అంబలి, మజ్జిగ పంపిణీ ●

హ్యాట్సాప్‌ గంగన్న

వేసవి హడలెత్తిస్తోంది. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 10 దాటితే బయటకు వెళ్లడానికి జనం జంకుతున్నారు. కానీ రోజువారీ పనులు చేసుకునేవారు, కూలీలు, ఉద్యోగులు బయటకు వెళ్లక తప్పదు. మండుటెండలో బతుకు పోరాటం చేస్తున్నవారికి..చల్లని సేవ చేస్తున్నారు. జిల్లాకు చెందిన కొందరు దాతలు. వేసవి నేపథ్యంలో చలివేంద్రం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. కొందరు అంబలి, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేస్తూ.. మానవ సేవే మాధవ సేవగా తరిస్తున్నారు.

కడెం: మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్‌ మాజీ సర్పంచ్‌, స్పందన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బొడ్డు గంగన్న అంబలి కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజల దాహార్తిని తీర్చుతున్నాడు. ఏడేళ్లుగా వేసవిలో నచ్చన్‌ఎల్లాపూర్‌ బస్టాప్‌ వద్ద, మండల కేంద్రంలో వీటిని ఏర్పాటు చేసి సామాజిక సేవలో ముందుకుసాగుతున్నాడు. ఇందుకు గంగన్న సొంత ఖర్చులు వెచ్చిస్తుండడం గమనార్హం. కాగా, గంగన్న బుధవారం మండల కేంద్రంలో అంబలి కేంద్రం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగన్నను ఎమ్మెల్యే అభినందించారు.

అంబలి పంపిణీ చేస్తున్న పాకాల రాంచందర్‌

పదేళ్లుగా అంబలి పంపిణీ..

Advertisement
 
Advertisement
Advertisement