పంటల నమోదుకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

పంటల నమోదుకు అవకాశం

May 3 2026 8:05 AM | Updated on May 3 2026 8:05 AM

సారంగపూర్‌: మండలంలోని జామ్‌ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న విక్రయించిన రైతుల వివరాలు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కనిపించకపోవడంతో ఇక్కడి రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈనేపథ్యంలో ‘తప్పెవరిది?’ శీర్శికన శనివారం ‘సాక్షి’ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్‌ సమస్యను వ్యవసాయ శాఖ స్టేట్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చి మళ్లీ ఆన్‌లైన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఈమేరు శనివారం ఏఈవో అరుణ్‌ వద్ద తమ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement