కుంటాల : మండలంలోని ఓల గ్రామంలో బస్టాండ్ వద్ద ప్రతీ వేసవిలో శ్రీవాసర సరస్వతీ శిశు మందిర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా పాదయాత్రికులు, గ్రామీణ ప్రజలు, ప్రయాణికులు దాహం తీర్చుకుంటున్నారు. మండు టెండల తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నారు. ప్రతీ సీజన్‌లో నీటి సరఫరా ఏర్పాటు, కేంద్ర పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు స్థానిక విద్యార్థులు, గ్రామస్తులు స్వయంగా ముందుకొస్తున్నారు. ఈ సంప్రదాయం ఓల ప్రజల్లో సేవాభావాన్ని చాటుతుంది. అందరూ తమవంతు సహాయం చేస్తూ.. సేవాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.


