క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ కీలకం | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ కీలకం

May 3 2026 8:05 AM | Updated on May 3 2026 8:05 AM

● ఎస్పీ జానకీషర్మిల

● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ ప్రతీ పోలీసుకు కీలకమని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో జిల్లాలోని సివిల్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌ సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్‌ నిర్వహించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్‌డ్‌ డ్రిల్‌, స్క్వాడ్‌ డ్రిల్‌ను పరిశీలించారు. వీక్లీ పరేడ్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌తోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాకు, పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రెగ్యులర్‌గా హెల్త్‌ చెకప్‌లు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ సమ్మయ్య, ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్లు రామ్‌నిరంజన్‌, శేఖర్‌, రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వీక్లీ పరేడ్‌లో సెల్యూట్‌ చేస్తున్న ఎస్పీ జానకీషర్మిల

Advertisement
 
Advertisement
Advertisement