వేసవిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతుంటారు. వారి దాహార్తి తీర్చేందుకు 14 ఏళ్ల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి గ్రామస్తులు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. విద్యార్థులు కూడా సేవ చేస్తూ సేవాభావం పెంచుకుంటున్నారు.
– లోలం గజానంద్, ప్రిన్సిపాల్, ఓల
సేవే ధ్యేయం..
పాతకాలంలో వేసవిలో అంబలి తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడేది. ప్రజలు ఆ అలవాటును మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. 10 ఏళ్లుగా అంబలి అందిస్తున్నాను. దీంతో రైతులకు కూడా జొన్నల కొనుగోలు ద్వారా లాభం చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాను.
– పల్లికొండ జనార్దన్, ఖానాపూర్.


