డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరవేయడమే లక్ష్యం
ఖానాపూర్: సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ ప ట్టణంలో శనివారం నిర్వహించిన ‘‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’’ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు.99 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వా రా ప్రజలతో ప్రభుత్వం మరింత దగ్గరవుతోందని పేర్కొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గానికి 6,155 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, 53 వేల కు టుంబాలకు 200 యూనిట్ల సబ్సిడీ విద్యుత్ అంది స్తున్నామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రోడ్లు, వంతెనల పనులు అసంపూర్తిగా ఉండటానికి సంబంధిత అధికారులు, ఏజెన్సీలు వివరాలు ఆన్‌లైన్‌లో అప్లో డ్ చేయకపోవడమే కారణమని తెలిపారు. అటవీ గ్రామాల్లో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల పనుల వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కడెం మండలం గంగాపూర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలన్నారు. పెంబి మండలం పసుపుల వద్ద వంతెన నిర్మిస్తామని తెలిపారు. సదర్మాట్ ప్రత్యేక కాలువ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేరవేయడమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని కలెక్టర్ భవేశ్ మిశ్రా అ న్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పెండింగ్ ఫైల్స్ పరి ష్కారం, విద్య, వైద్యం, అరైవ్ అలైవ్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ స్థా యికి విస్తరించి ప్రజల సమస్యలను నిర్దిష్ట గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులను సన్మానించారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ది వ్యాంగులకు రూ.95 వేల విలువగల 8 స్కూటీలు, 4 ల్యాప్‌టాప్‌లు పూర్తిస్థాయి సబ్సిడీతో అందజేశా రు. అనంతరం వివిధ శాఖల స్టాళ్లను ఎమ్మెల్యేతో క లిసి సందర్శించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్లు పడిగెల భూషణ్, లక్ష్మీనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
కలెక్టర్ భవేశ్ మిశ్రా


