● యూఎస్‌ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
బాసర: బాసర ట్రిపుల్‌ఐటీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. గతేడాది డిసెంబర్ 22 నుంచి 2026 మార్చి 13 వరకు ఆర్జీయూకేటీయేతర విద్యాసంస్థలకు చెందిన 4,966 మంది విద్యార్థులు క్యాంపస్‌ను సందర్శించారు. స్వల్ప కాల వ్యవధిలో సందర్శించినందుకు గాను యూఎస్‌ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. విద్యార్థుల మధ్య సత్సంబంధాలు పెంచడం, క్యాంపస్ వాతావరణంపై అవగాహన కల్పించడం, జ్ఞాన మా ర్పిడిని ప్రోత్సహించినందుకు సంస్థ ప్రతినిధులు.. ట్రిపుల్‌ఐటీకి ధ్రువపత్రం, స్వర్ణ పతకం, ట్రోఫీని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌కు అందజేశారు. ఇందులో కీలకపాత్ర వహించిన డా.విట్టల్ బృందాన్ని, క్యాంపస్‌ను సందర్శించిన విద్యార్థులతోపాటు అధ్యాపకులను శనివారం ఇన్‌చార్జి వీసీ అభినందించారు.


