న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకోవాలి

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

ఖానాపూర్‌: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన న్యాయవాది గంగుల సత్యార్థప్రకాశ్‌పై జరిగిన దాడి ఘటనపై ఖానాపూర్‌ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు స్పందించారు. బుధవారం బాధిత న్యాయవాది వద్దకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదుల భద్రత కు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. అసోసియేషన్‌ అధ్యక్షుడు మట్టేరి రాజశేఖర్‌, ఖానాపూర్‌ ఏజీపీ ఆసిఫ్‌ అలీ, సీనియర్‌ న్యాయవాది వెంకట్‌ మహేంద్ర, జాయింట్‌ సెక్రటరీ బాశెట్టి శివ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement