న్యూస్‌రీల్
రాష్ట్రస్థాయిలో జిల్లాకు మూడోస్థానం గతేడాది కంటే మెరుగైన ఫలితాలు ఈసారి కూడా బాలికలదే పైచేయి సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు
గిరిజనుల కల్పతరువు ‘ఇప్ప’
ప్రకృతి ప్రసాదించిన ఇప్పపువ్వు గిరిజనులకు కల్పతరువుగా నిలుస్తోంది. అటవీ ప్రాంతాల్లో నివసించే గోండి, కొలాం గిరిజనులకు ఇప్పపువ్వు సేకరణతో ఉపాధి లభిస్తోంది.
బాధితులకు న్యాయం చేయాలి
భైంసాటౌన్: బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో బు ధవారం నిర్వహించిన ప్రజావాణికి హాజరై భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీ లు స్వీకరించారు. అప్పటికప్పుడు సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి బాధితుల కు చట్టపరంగా అవసరమైన సహాయం అందించాలని సూచించారు. అనంతరం గత ప్ర జావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కార స్థితిపై సంబంధిత అధికారులను అడిగి తెలు సుకున్నారు. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు.
నిర్మల్ రూరల్: చదువులతల్లి జ్ఞానసరస్వతీ కొలు వైన జిల్లాలో పదోతరగతి విద్యార్థులు సత్తా చాటా రు. బుధవారం విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో 98.96శాతం ఉత్తీర్ణతతో జిల్లాను రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిపారు. గతేడాది 96.70శాతంతో 15వ స్థానంలో నిలువగా, ఈసారి 12 స్థానాలు పైకి ఎగిసి మూడో స్థానంలో నిలవడం విశేషం. ఈసారి కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించా రు. జిల్లాలో 9,743 మంది విద్యార్థులకు గాను 9,642 మంది ఉత్తీర్ణులు కాగా, 101 మంది ఫెయిలయ్యారు. ఇందులో 4,779 మంది బాలురకు 4,711 (98.5శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 68 మంది ఫెయిలయ్యారు. 4,964 మంది బాలికలకు 4,931 (99.34శాతం) పాసవగా 33మంది అనుత్తీర్ణులయ్యారు. సర్కారు బడులు మంచి మార్కులతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా నిలిచాయి. జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాలు సత్తా చాటాయి.
ప్రణాళికతో ముందుకెళ్లడంతోనే..
పదోతరగతి ఫలితాల్లో జిల్లా 2022–23, 2023–24 విద్యాసంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది 96.70శాతంతో 15వ స్థానానికి పడిపోయింది. ఈసారి 98.96శాతంతో మూడోస్థానంలో నిలిచి సత్తా చాటింది. గతేడాది కంటే ఈసారి మెరుగైన స్థానం సాధించడం విశేషం. వి ద్యార్థులు, విద్యాశాఖ అధికారులు ప్రణాళిక ప్రకా రం ముందుకెళ్లారు. గత కలెక్టర్ అభిలాష అభినవ్, సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన డీఈవో భోజన్న మెరుగైన ఫలితాల సాధనకు మరింత దృష్టి కేంద్రీకరించారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు, దా తలు, వీడీసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహా రం అందించి ప్రోత్సహించారు. డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తి చేసి కఠిన అంశాలపై పునఃశ్చరణ త రగతులు నిర్వహించారు. విద్యార్థులకు సరైన సమయంలో రెండుసార్లు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి అందులో వెనుకబడినవారిని ప్రత్యేక తరగతులతో ప్రోత్సహించారు. ఒక్కో పరీక్షకు దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధి ఇవ్వడం కూడా కలిసివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
సమష్టి కృషితోనే మెరుగైన స్థానం
పదోతరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో సమష్టి కృషితోనే మెరుగైన స్థానం సాధించాం. ఉన్నతాధికారుల దిశానిర్దేశం మేరకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చాలా కష్టపడ్డారు. రెండుసార్లు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. గ్రాండ్ టెస్టులు, స్పెషల్ టెస్టులు నిర్వహించి విద్యార్థుల్లో పరీక్షలంటే భయం పోగొట్టాం. ఫెయిలైన విద్యార్థులు అధైర్య పడకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రిపేర్ కావాలి. ఉత్తీర్ణులయ్యేలా కష్టపడాలి.
– భోజన్న, జిల్లా విద్యాధికారి
జూన్ 5నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పదోతరగతిలో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 5నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 5నుంచి 12వరకు ప్రతిరోజూ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 30నుంచి సంబంధిత ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించాలి. విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 30నుంచి మే 14వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్ట్‌కు రీకౌంటింగ్ ఫీజు రూ.500 కాగా, రీ వెరిఫికేషన్ ఫీజు రూ.వెయ్యిగా నిర్ణయించారు.


