నిర్మల్‌చైన్‌గేట్: ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థా యిలో అరికట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని స మావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణాతోపా టు పలు రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారమే ఇసు క అమ్మకాలు జరగాలని, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణపై అలసత్వం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని సూచించా రు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరి ష్కరించాలని తెలిపారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఆక్విజిషన్ జలకుమారి, సీపీవో జీవరత్నం, ఏడీ మైన్స్ హరిప్రసాద్, ఏడీ ల్యాండ్ సర్వేయర్ నరసింహమూర్తి, త హసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగమేళా పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భా గంగా నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 6న ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న జాబ్‌మేళాలో అర్హులైన నిరుద్యోగ యువత పాల్గొనవచ్చని తెలిపారు. పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదా https:// satg. telangana. gov. in/ prajapalana ౖెసట్ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, యువజన క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఉపాధి కల్పనాధికారి విజయలక్ష్మి ఉన్నారు.
కడెం ప్రాజెక్ట్ సందర్శన
కడెం: కడెం ప్రాజెక్ట్‌ను కలెక్టర్ భవేశ్ మిశ్రా సందర్శించారు. గతంలో వచ్చిన భారీ వరద ల గురించి, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో, సామర్థ్యం, ప్రస్తుత నీటిమట్టం తదితర వివరాలను ఇరిగేషన్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రాజెక్ట్‌లో పూడికతీత పనుల గురించి అడిగి, రానున్న వానాకాలంలోపు ప్రాజెక్ట్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి వచ్చినందున భవేశ్ మిశ్రాను స్థానిక సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్ శాలువాతో సన్మానించారు. ఎస్‌ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డీఈ వీరన్న, తహసీల్దార్ ఖాజా మొయినొద్దీన్, ఎంపీడీవో సునీత, ఏఈఈలు మురళీకృష్ణ, నితిన్, చైతన్య, ప్రాజెక్ట్ సిబ్బంది తదితరులున్నారు.


