ఖానాపూర్: పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నా రు. మండలంలోని తర్లపాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను బుధవారం ప్రారంభించి లబ్ధిదారులకు శు భాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులు ఎ మ్మెల్యేను శాలువాతో సన్మానించారు. నియోజకవ ర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ స మస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పాత తర్లపాడ్ సర్పంచ్ పడిగెల మల్లారెడ్డి, ఉపసర్పంచ్ సాయిరాం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఖానాపూర్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని వారసంతలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు చిన్నం సత్యం, గుగ్లావత్ రాజేందర్‌నాయక్, నిమ్మల రమేశ్, పోలంపెల్లి సచిన్, సార్ల నర్సయ్య, జంగిల్ శంకర్, గుడాల రాజన్న, మదిరె సత్యం, జమాల్ ఖురేషి, నేత శ్యామ్, రెడ్డి నరేందర్, మాజిద్, రమేశ్, గంగాధర్, శంకర్, షబ్బీర్ పాషా, అమానుల్లాఖాన్, శేషాద్రి, శ్యామ్, చరణ్ తదితరులున్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
కడెం: మండలంలోని పెద్దూర్‌తండా వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. అనంతరం కొండుకూర్ గ్రామంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్ భూషణ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మల్లేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, సర్పంచులు విజయ్‌కుమార్, జడ లావణ్యకృష్ణ, భీమేశ్, శిరీషాసత్యం, లతానరేశ్, తేజస్వినీశ్రీనివాస్, లక్ష్మీభూమన్న, డీసీసీ మెంబర్ వెంకటేశ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులున్నారు.
అంబలి కేంద్రం ప్రారంభం
మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్ మాజీ సర్పంచ్, స్పందన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బొడ్డు గంగన్న మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. వేసవిలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజల దాహార్తిని తీర్చుతున్న బొడ్డు గంగన్న సేవలు అభినందనీయమని కొనియాడారు.


