‘బిల్లులు వీగిపోవడం దురదృష్టకరం’ | - | Sakshi
Sakshi News home page

‘బిల్లులు వీగిపోవడం దురదృష్టకరం’

Apr 30 2026 8:55 AM | Updated on Apr 30 2026 8:55 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: పునర్విభజన చట్టం, మహిళా రిజ ర్వేషన్‌ చట్టంలో సవరణలు పార్లమెంట్‌లో వీగిపోవడం దురదృష్టకరమని బీజేపీ జిల్లా ఇన్‌చార్జి గోపి డి శ్రవంతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మహేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మహిళా ఆక్రోష్‌ పేరిట పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌ రాథోడ్‌, స్టేట్‌ మీడియా ప్యానలిస్ట్‌ బొమ్మరాగోని రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మా ట్లాడారు. బిల్లులను అడ్డుకోవడం కాంగ్రెస్‌, వారి మిత్రపక్షాలు చేసిన చారిత్రక తప్పిదమని ఆరోపించారు. వారు మహిళాద్రోహులుగా చరిత్రలో నిలిచి పోతారని విమర్శించారు. ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్‌కు ఇది మొదటిసారి కాదని, మొత్తంగా ఏడుసార్లు ఈ బిల్లును కాంగ్రెస్‌ వారి మిత్రపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అంకం మౌనిక, కౌన్సిలర్లు రావుల రమ్య, బొబ్బరపు సత్యవతి, సర్పంచ్‌ సిరం సుష్మారెడ్డి, నాయకురాలు తిరుమల, కల్పనాగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement