లోకేశ్వరం: మాదక ద్రవ్యాలను ప్రతి ఒక్కరూ ని ర్మూలించాలని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ సూచించారు. బుధవారం మండలంలోని ధర్మోర గ్రామంలో గాంజా గస్తీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గాంజా వినియోగం, అక్రమ రవాణాపై కఠినచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువత గాంజాకు అలవాటు పడకుండా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు గమనించా లని సూచించారు. ప్రజలు సహకరించి.. ఎక్కడైనా గాంజా విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ముథోల్ సీఐ రవీందర్, లోకేశ్వరం ఎస్సై అశోక్, సర్పంచ్ సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ మంద గణేశ్, పంచగుడి ఉపసర్పంచ్ గంగాధర్, రాజూర మాజీ సర్పంచ్ ముత్తగౌడ్ ఉన్నారు.


