నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

● జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● 42–43 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ● మున్ముందు మరింత పెరిగే ఛాన్స్‌ ● ఇళ్లల్లో ఉన్నా.. భరించలేనంత వేడి ● అల్లాడుతున్న చిన్నారులు, వృద్ధులు గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

రోజుకు కనీసం 3–4 లీటర్ల నీళ్లు తాగాలి.

ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల మధ్య బయటకు వెళ్లడం తగ్గించాలి.

తేలికపాటి దుస్తులు ధరించాలి. కాటన్‌, లైట్‌ కలర్‌ దుస్తులు వేసుకోవడం మంచిది.

శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. ఎండలో నుంచి రాగానే నేరుగా స్నానం చేయకూడదు. అవసరమైతే ఫ్యాన్‌ లేదా కూలర్‌ ఉపయోగించండి.

ఈ సీజన్‌లో పండ్లు, ద్రవపదార్థాలు తీసుకోవాలి. కర్బూజా, దోసకాయ, కొబ్బరి నీరు, లస్సీ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

బయట ఆహారం తగ్గించాలి. ఆయిల్‌ ఫుడ్‌ దాదాపు తగ్గించాలి. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

బయటకు వెళ్లేటప్పుడు చర్మాన్ని రక్షించే సన్‌స్క్రీన్‌ వాడాలి.

తల తిరగడం, వాంతులు, ఎక్కువ చెమటలు, అలసట ఉంటే వెంటనే నీడలోకి వెళ్లి నీరు తాగాలి. ఇబ్బంది ఎక్కువగా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.

చిన్నపిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి. వాళ్లు త్వరగా డీహైడ్రేట్‌ అవుతారు కాబట్టి ఎక్కువ జాగ్రత్త అవసరం. తరచూ నీళ్లు, ద్రవపదార్థాలు ఇస్తూ ఉండాలి.

ఈసీజన్‌లో మద్యం, కాఫీ ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.

సర్కారు ఆణిముత్యాలు

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ చదివిన పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో మెరిశారు. రాష్ట్రస్థాయిలో రాణించి ఆదర్శంగా నిలిచారు.

నిర్మానుష్యంగా జిల్లా

కేంద్రంలోని ప్రధాన రహదారి

వ్యాక్సిన్‌ తప్పనిసరి

భైంసాటౌన్‌: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు 14–15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించాలని డీఎంహెచ్‌వో రాజేందర్‌ సూచించారు. పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను బుధవారం సందర్శించారు. పట్టణంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. బాలికలు, వారి తల్లిదండ్రులకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. డీసీహెచ్‌ఎస్‌, భైంసా ఏరియాస్పత్రి సూపరింటెండెంట్‌ కాశీనాథ్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. 14–15 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్‌ వేయించాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆకాశ్‌, వైద్యులున్నారు.

రెండు వారాల ముందునుంచే..

ఉదయం 7నుంచే సూర్యుడు ఎర్రగా మారిపోతున్నాడు. పొద్దున 10 గంటల నుంచే వేడిని పెంచేస్తున్నాడు. అప్పుడే ఇంట్లో, బయట దాదాపు 30–35 డిగ్రీ సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రత మొదలవుతోంది. మధ్యాహ్నం 12నుంచి 3గంటల దాకా ఎండ తీవ్ర త విపరీతంగా ఉంటోంది. సాయంత్రం ఏడున్నర గంటల దాకా వేడి తగ్గడం లేదు. దీంతో పలు పాఠశాలలు పరీక్షలు వారం ముందే పూర్తిచేసి, 16నుంచే వేసవి సెలవులు ప్రకటించాయి. జిల్లాలో సాధారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే ఉంటా యి. కానీ.. ఏప్రిల్‌ చివరివారం నుంచి 43–44 డిగ్రీ సెల్సియస్‌గా నమోదవుతుంటాయి. ఈసారి రెండువారాల ముందు నుంచే ఈస్థాయిలో ఎండ మండిపోతోంది. ప్రస్తుతం 42–43 డిగ్రీ సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. రెండు, మూడురోజు ల్లో 44డిగ్రీ సెల్సియస్‌కూ చేరుకుంటుందని వాతా వరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎప్పు డో మే నెలలో ఉండాల్సిన ఎండలు ఇప్పుడే ఇలా మండిపోతుంటే.. ఇక వచ్చేనెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు.

పనిచేయని ఫ్యాన్‌లు

ఇళ్లల్లో ఫ్యాన్‌ గాలి కూడా వేడిగా వస్తోంది. రూ.వేలు పెట్టి కూలర్లు, ఏసీలు కొనలేని పేద, మధ్యతరగతివారు వేడికి తట్టుకోలేకపోతున్నారు. చాలామంది అప్పు చేసో, నెలవారీ ఫైనాన్స్‌ లోనో తీసుకుని కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాత కూలర్లను పక్కనపెట్టి ఈఎంఐలలో ఏసీలు తీసుకుంటున్నారు. బైక్‌, స్కూటీలపై కాకుండా కార్లలో డ్యూటీలకు వెళ్తున్నారు. ఇలా ఎండాకాలం ఖర్చులనూ మండిస్తోందని వాపోతున్నా రు. కాగా, ఎండాకాలంలో ఎండలు దంచి కొడు తుండగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఇబ్బందికరంగా మారుతోంది. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు చాలా జాగ్రత్తగా ఉండాల ని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే మిన హా ఎండలో తిరగవద్దని చెబుతున్నారు.

అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సీజ న్‌లో ఎండలో తిరగడం ఏమాత్రం మంచిదికాదు. అ త్యవసరమైతే అది కూడా తగిన జాగ్రత్తలతో బయట కు అడుగుపెట్టాలి. డీహైడ్రేషన్‌ కాకుండా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

– డాక్టర్‌ బి.రవి, ఎండీ, నిర్మల్‌

చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి

ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండలో ఎట్టిపరిస్థితుల్లో ఆడుకోనివ్వద్దు. తరచూ మంచినీటిని తాగిస్తూ ఉండాలి. వీలైతే ఓఆర్‌ఎస్‌, కొబ్బరినీళ్లు తాగించాలి. వడదెబ్బ తగిలి నట్లు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలి.

– డాక్టర్‌ నాళం స్వప్న, చిన్నపిల్లల వైద్యురాలు, నిర్మల్‌

‘బాబోయ్‌.. ఇదేం ఎండ..! ఇట్ల మండిపోతోంది..’ అంటూ జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. ఏప్రిల్‌ రెండోవారంలోనే గరిష్ట ఉష్ణోగ్రత 43–44 డిగ్రీల వరకు చేరుకుని పరేషాన్‌ చేస్తోంది. ఉదయం ఏడింటి నుంచే సూరీడు ఎర్రగా ఎదుగుతూ మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. కాసేపు బయట ఎండలోకి వెళ్లివస్తే.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒక్కసారిగా నీరసం వచ్చేస్తోంది. ‘అమ్మో.. ఇంకాసేపు ఈ ఎండలో ఉంటే.. ఏమవుతుందో..! అన్న ఫీలింగ్‌ కలుగుతోంది. చిన్నారులు, పండుటాకులకు ఈ వేడి మరింత ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్‌లో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని, కచ్చితంగా వడదెబ్బ నుంచి ముందుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. – నిర్మల్‌

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Advertisement
 
Advertisement
Advertisement