శ్రీరాంపూర్ ఏరియా ముఖ ద్వారం
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా గనులు వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో వెనుకబడ్డాయి. బుధవారంతో ఆర్థిక సంవత్సరం ముగియగా కంపెనీ గణంకాల ప్రకారం ఈసారి ఉత్పత్తి తక్కువ జరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ గ నులు నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఓసీపీల్లో ఓబీ కాంట్రాక్ట్ సమస్యలు, కాలం చెల్లిన భూగర్భ గనుల్లో కొత్త సీమ్‌లు లేకపోవడం వెరసి ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేనట్లు అధి కారులు పేర్కొంటున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ ఏరియా లక్ష్యం 65,16,000 టన్నులకు గానూ 57,86,282 టన్నులు సాధించి 88.8 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరం 65,16,000 టన్నులకు గానూ 44,06,291 టన్నులు సాధించి 68 శాతం లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. ఇంత తక్కువలో నమోదు కావడంతో పదేళ్లలో ఇదే తొలిసారి. లక్ష్యానికి ఈ సారి ఇంకా 32 శాతం లోటు ఉంది.
ఓబీ కాంట్రాక్టర్లే నిండా ముంచారు...
శ్రీరాంపూర్‌లో మూతపడిన ఆర్కే 6 మినహా 6 భూ గర్భ గనులు, రెండు ఓసీపీలు నడుస్తున్నాయి. ఎ స్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీల్లో గడిచిన సంవత్సరం ఓబీ వెలికితీతలో తీవ్ర జాప్యం జరిగింది. కాంట్రాక్టర్లు ఓబీ మట్టి తీయకపోవడంతో దీని ప్ర భావం బొగ్గు ఉత్పత్తిపై పడింది. ఈ రెండు ఓసీపీల్లో కాంట్రాక్టర్లు పనులు చేయమని చేతులెత్తడంతో ఓబీ నిలిచిపోయి దాని ప్రభావం ఉత్పత్తిపై పడింది. ఏరియాలోని రెండు ఓసీపీల్లో ఓబీ తీయాల్సిన లక్ష్యంలో కేవలం 38 శాతమే నమోదైంది. దీంతో బొగ్గు తీయలేకపోయారు. అనంతరం కొత్త టెండ ర్లు పిలిచి వాటికి పనులు అప్పగించి మొదలు పెట్ట డం జాప్యం మూలంగా మరింత నష్టం జరిగింది.
భూగర్భ గనుల్లో నామమాత్రమే..
భూగర్భ గనుల్లో నిర్ధేశించిన లక్ష్యంలో 90 శాతమే సాధించారు. ఆరు గనుల్లో కేవలం ఆర్కే న్యూటెక్ గని, ఎస్సార్పీ 1 గనులు మాత్రమే నూరుశాతం ఉత్పత్తిని సాధించాయి. మిగిలిన అన్ని గనుల్లో నూరు శాతం లోపే ఉత్పత్తి జరిగింది. ఆర్కే 5 గని 96 శాతం, ఆర్కే 7 గని 95 శాతం, ఆర్కే న్యూటెక్ గని 113 శాతం, ఎస్సార్పీ 1 గని 103 శాతం, ఎస్సార్పీ 3, 3 ఏ గని 74 శాతం, ఐకే 1ఏ గని 81 శాతం, ఎస్సార్పీ ఓసీపీ 59 శాతం, ఐకే ఓసీపీ 66 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకున్నాయి. ఎస్సార్పీ 1, ఆర్కే న్యూటెక్ గనుల్లో పని స్థలాలు లేవు. ఇటీవలే అధికారులు వాటి జీవితకాలం పెంచడానికి కొత్త సీమ్‌లను ప్రారంభించడంతోనే ఉత్పత్తి జరిగింది.


