107 మక్కల బస్తాలు చోరీ | - | Sakshi
Sakshi News home page

107 మక్కల బస్తాలు చోరీ

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

కుంటాల: మండలంలోని కల్లూరు –కుంటాల అంతర్రాష్ట్ర రహదారిపై కొత్త వెంకూర్‌ సమీపంలో తూకం వేసి ఉంచిన 107 మక్కల బస్తాలు శనివారం రాత్రి చోరీకి గురయ్యాయి. మండలంలోని కొత్త వెంకూర్‌ గ్రామానికి చెందిన మగ్గిడి చిన్న నారాయణ తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. వారం క్రితం పంట కోసి ఆరబెట్టాడు. శనివారం రాత్రి పాత వెంకూర్‌ గ్రామానికి చెందిన ప్రైవేటు వ్యాపారి దత్తు పటేల్‌కు మక్కలు విక్రయించాడు. బస్తా 55 కేజీల చొప్పున తూకం వేసిన 107 బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లి పోయారని రైతు వాపోయాడు. బస్తాలు చోరీ జరగడంతో రూ.1 లక్ష 42 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం ఎస్సై అశోక్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement