లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఆదివారం కడ్తాల్ గ్రామానికి చెందిన బుచ్చవ్వ(73) పని నిమిత్తం నిర్మల్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో రాత్రి సమయంలో గ్రామానికి ఆటోలో వచ్చింది. ఆటో దిగిన బుచ్చవ్వ రోడ్డు దాటే క్రమంలో జాతీయ రహదారిపై గల లైట్లు వెలగకపోవడంతో గుర్తు తెలియని వాహనం వచ్చి వేగంగా ఢీకొట్టడంతో ఎగిరి రోడ్డుపై పడి అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరించారు. జాతీయ రహదారిపై గల లైట్లు వెలగకపోవడంతో రోడ్డుపై వస్తున్న వాహనం కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. అనంతరం సర్పంచ్ రాములు, అధికారులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.


