నేడు బాసరకు సీఎం రాక | - | Sakshi
Sakshi News home page

నేడు బాసరకు సీఎం రాక

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

● ఏర్పాట్లు చేసిన అధికారులు ● 500 మంది పోలీసులతో బందోబస్తు

భైంసా/బాసర: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. ఆదివారం బాసరలో కలెక్టర్‌ అధికారులతో కలిసి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. పర్యటన మార్గం, భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. సీఎం పర్యటన సందర్భంగా క ట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. 500 మంది పో లీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏ ర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగుతుందని, డ్రోన్‌ కెమెరాలు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని వెల్ల డించారు. సమావేశంలో ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, ఆలయ ఇన్‌చార్జి ఈవో విజయరామారావు పాల్గొన్నారు.

సీఎం పర్యటన

షెడ్యూల్‌ ఇలా...

ఉదయం 10:20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బాసరకు బయల్దేరతారు. 11 గంటలకు బాసర హెలీప్యాడ్‌కు చేరుకుని రాజన్న గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 11:10 నుంచి 12:10 వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని పూ జలు చేస్తారు. మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 వరకు ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారు. 12:30 నుంచి 1:30 వరకు రిజర్వ్‌ టైమ్‌. 1:45 గంటలకు హెలిక్యాప్టర్‌లో బాసర నుంచి ఆదిలాబాద్‌ జిల్లాకు వెళ్తారు. 2:15 గంటలకు పిప్రికి చేరుకుంటారు. 2:20 నుంచి 2:30 వరకు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనచేస్తారు. 2:30 నుంచి సాయంత్రం 4:10 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. ఐఎస్‌వో సర్టిఫికెట్లు, వడ్డీలేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. సీఎం కప్‌ విజేతలకు ట్రోఫీని బహూకరిస్తారు. 4:20గంటలకు హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement