‘రేవంతన్నా.. 2022 జూన్ 17న ఉవ్వెత్తున సాగుతున్న ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా టీపీసీసీ అధ్యక్ష హోదాలో బాసరకు వచ్చారు. అప్పటి ప్రభుత్వ అడ్డంకులన్నీ దాటుకుంటూ.. ఇలా ట్రాక్టర్‌లో, నడుస్తూ వచ్చి ట్రిపుల్‌ఐటీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాతే అప్పటి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇప్పుడు మీదే ప్రభుత్వం, మీరే ముఖ్యమంత్రి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ బాసర వస్తున్నారు. మా సమస్యలపైనా దృష్టిపెట్టండి. మా గోసనూ తీర్చండి..’ అంటూ బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు కోరుతున్నారు.


