నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

● ‘బాసర’ అభివృద్ధిపై జిల్లా హర్షం ● ఇక.. ట్రిపుల్‌ఐటీని గాడిన పెట్టాలె ● ప్యాకేజీ–28 కోసం ఎదురుచూపులు ● యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడో.. ● జిల్లాలో కనిపించని పారిశ్రామికీకరణ ● సీఎంగా తొలిసారి బాసర కు రాక.. సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 8–9లోu జనగణనకు అదనపు సిబ్బందిని నియమించాలి ● డీఈవోకు టీయూటీఎఫ్‌ విజ్ఞప్తి నిర్మల్‌ రూరల్‌: త్వరలో ప్రారంభం కానున్న జనగణన(సెన్సెస్‌)లో భాగంగా హౌస్‌ లిస్టింగ్‌ సర్వేలో అదనపు సిబ్బందిని(రిజర్వు) నియమించాలని డీఈవో భోజన్నకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఆదివారం వినతిపత్రం అందించారు. జిల్లా అధ్యక్షుడు రవికాంత్‌ మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్ట్యా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సర్వే సజావుగా కొనసాగేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మురళీమనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వహీద్‌ఖాన్‌ పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

రేవంతన్నా.. జర సూడన్న..!

ఘనంగా జగ్జీవన్‌రామ్‌ జయంతి

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ జయంతిని జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.

నిర్మల్‌/భైంసా: చదువుల తల్లి క్షేత్రం బాసర శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారికి భవ్యమైన ఆలయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లు కేటాయించింది. ఈ పనులకు సోమవారం భూమిపూజ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా బాసరకు వస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బాసర ఆలయ అభివృద్ధికి ఇప్పటికై నా ముందడుగు పడడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చదువులమ్మ చెంతనే ఉన్న విద్యాక్షేత్రం ట్రిపుల్‌ఐటీని గాడిన పెట్టాలని కోరుతోంది. తలాపునే గోదావరి ఉ న్నా.. పంటలకు తడి అందని ముధోల్‌ నియోజకవర్గానికి నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–28ను పూర్తిచేయాలని విన్నవిస్తోంది. ఇక జనవరి 16న నిర్మల్‌ ప్రజాపాలన సభలో స్వయంగా ప్రకటించిన జ్ఞానసరస్వతీ యూని వర్సిటీని త్వరగా ప్రారంభించాలని అభ్యర్థిస్తోంది. అన్నిరంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్న జిల్లాకు ఇప్పటికై నా ఓ దశదిశ చూపాలని కోరుతోంది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బాసర రావడం ఇదే తొలిసారి. చివరిసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఇక్కడికి వచ్చారు.

ప్యాకేజీ–28 పూర్తిచేయిస్తే..

గోదారమ్మ తలాపునే పారుతున్నా ముధోల్‌ ని యోజకవర్గ రైతుల పంటలకు తడి అందడం లేదు. ఈ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల కు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గత ప్ర భుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ–28 ద్వారా పనులు చేపట్టింది. కాలువల తవ్వకం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలూ ఆవిరైపోతున్నాయి. ప్యాకేజీ–28 కింద కాలువలు తవ్వడం, పంపుల సామర్థ్యం, మోటార్లు బిగించడం ఇలా అన్ని పనులకు కలిపి ఇప్పటి వరకు రూ.235.41 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ పనులకు ఇంకా రూ.251.26 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. పనుల్లో 49 శాతమే పూర్తయ్యాయి. లోకేశ్వరం మండలం బ్రహ్మేశ్వర్‌ వద్ద లిఫ్ట్‌ నిర్మించి కాలువల ద్వారా లోకేశ్వరం, ముధోల్‌, తానూరు, కుభీర్‌ మండలాలకు మరోవైపు గుండంపెల్లి వైపు నుంచి కాలువలు తవ్వి కుంటాల, భైంసా మండలాలకు సాగు నీరు అందించేలా డిజైన్‌ చేశారు. ఈ పథకం పూర్తయితే నియోజకవర్గంలో రెండు పంటలకు సాగునీరందుతుంది.

ట్రిపుల్‌ఐటీలో ఆశలు..

రాష్ట్రంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా పేరుగాంచిన ట్రిపుల్‌ ఐటీ బాసరలో ఎప్పుడూ ఏదో సమస్య వేధిస్తూనే ఉంది. కొన్ని ఇబ్బందులు దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. మౌలిక వసతుల లోపం, సిబ్బంది కొరత, హాస్టల్‌ సమస్యలు పేద, గ్రామీణ విద్యార్థుల విద్యాభ్యాసాన్నీ ప్రభావితం చేస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు వర్సిటీలో వైద్య సదుపాయాలూ అవసరమే. ట్రిపుల్‌ఐటీ సమస్యలపై ఇప్పటికే కమిషనర్‌ స్థాయికి నివేదిక చేరినప్పటికీ, అవి ఫైళ్లకే పరిమితం అవుతున్నాయి. 2022 ఆందోళన సమయంలో పీసీసీ చీఫ్‌ హోదాలో వచ్చి విద్యార్థులకు మద్దతు తెలిపిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వస్తుండటంతో విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆలయంలో అభివృద్ధి పనులకు భూమిపూజ తర్వాత ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను సందర్శించాలని విద్యార్థులు కోరుతున్నారు.

నేటి ప్రజావాణి రద్దు

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి బాసర పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement