విప్లవాత్మక సంస్కరణలు బీజేపీతోనే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

విప్లవాత్మక సంస్కరణలు బీజేపీతోనే సాధ్యం

Apr 7 2026 8:19 AM | Updated on Apr 7 2026 8:19 AM

● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్‌చైన్‌గేట్‌: దేశంలో అనేక విప్లవాత్మక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా నిలిపిన ఘనత భారతీయ జనతా పార్టీదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ స్థాపించినప్పుడు 2 స్థానాలతో మొద లై నేడు వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి రావడంలో కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం అధికారంలో వచ్చే దిశగా కార్యకర్తలు సమష్టిగా సమాయత్తం కావాలని సూచించారు. పల్లెల నుంచి పట్టణాల వరకు పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు రావుల రాంనాథ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.సత్యనారాయణగౌడ్‌, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి, బీజేపీ కౌన్సిలర్లు, జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement