లక్ష్మణచాంద: తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డిని కాంగ్రెస్ మండల నాయకులు సోమవారం కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి టూరిజం చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా వారిని మండల నాయకులు జిల్లా కేంద్రంలోని డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి నివాసంలో కలిశారు. శాలువాలతో సన్మానించారు. ఇందులో రఘునందన్‌రెడ్డి, సర్పంచులు అర్జున్‌రెడ్డి, నరేశ్, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్, నాయకులు కేశం రమేశ్, సంగం వెంకటరాజు, శేఖర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, పోశెట్టి పాల్గొన్నారు.
పటేల్ రమేశ్‌రెడ్డిని సత్కరిస్తున్న నాయకులు


