నిర్మల్ రూరల్: గతేడాది పదో తరగతి మూల్యాంకన పారితోషికం చెల్లించాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహిస్తున్న స్పాట్ విధులను బహిష్కరించి అక్కడే నిరసన చేశారు. గతేడాది సమగ్ర కుటుంబ సర్వే, పదో తరగతి మూల్యాంకన నిధులు ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. రెండు మూడు రోజు ల్లో డబ్బులు చెల్లించకుంటే పదో తరగతి స్పాట్ ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా పరీక్షల సహాయ అధికారి పరమేశ్వర్‌కు వినతిపత్రం అందించారు. ఇందులో రవికాంత్, భూక్య రాజేశ్‌నాయక్, అశోక్, దాసరి శంకర్, క్రాంతికుమార్, హరిప్రసాద్, మహేంద్రచారి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


