శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ఖానాపూర్: మండలంలోని పలు గ్రామాల్లో శ నివారం శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రంగపేట గ్రామంలోని శ్రీరాజరాజేశ్వర ఆలయ అర్చకులు గోనె శంకరయ్య, శివకుమార్ ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి చేపట్టారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తి ప్రతిమలతో ఖానాపూర్ పట్టణంలోని గోదావరి తీరానికి వెళ్లి జలాభిషేకం నిర్వహించారు. తర్వాత గణ పతి పూజ, పుణ్యహవచన విధి, అంకురారోపణ, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహనం, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ పెట్టెం రాధ, నాయకులు చంద్రశేఖర్, సుధాకర్ తదితరులు అభిషేకంలో పాల్గొన్నారు. మండలంలోని దిలావర్‌పూర్ గ్రామంలోని రాజరాజేశ్వరస్వామి ఆలయకమిటీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తి విగ్రహాలతో గోదావరిలో సర్పంచ్ చింతల మల్లేశ్, ఉపసర్పంచ్ ఓరగంటి రాజేశ్వర్, ఆలయ కమీటి సభ్యులు, భక్తుల సమక్షంలో అ భిషేకం నిర్వహించారు. ఆదివారం పలు పూ జాకార్యక్రమాలతోపాటు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.


