రెండో వేములవాడ బాబాపూర్
ఏర్పాట్లు పూర్తి
మండలంలోని తమ గ్రామంలో శివరాత్రి సందర్భంగా జరిగే శ్రీరాజరాజేశ్వర స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తాగు నీరు, స్నానా ల గదులు, దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు రూము సౌకర్యం కూడా ఉంది.
– పడిగెల లక్ష్మి, బాబాపూర్ సర్పంచ్
మహిమ గల స్వామి
భక్తుల కోర్కెలు తీర్చే దేవునిగా ఇక్కడి శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి ప్రతిష్ట ఉంది. రెండో వేములవాడగా ప్రసిద్ధి చెందినది. శివరాత్రి ఉత్సవాలకు పొరుగు జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. – సురేశ్‌రెడ్డి, ఉప సర్పంచ్
లక్ష్మణచాంద: మండలంలోని బాబాపూర్ గ్రామంలో కొలువైన శ్రీరాజరాజేశ్వరస్వామి భక్తుల కోరికలు తీరుస్తూ శక్తివంతమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రెండో వేములవాడగా గుర్తింపు పొందింది . ఏటా మహాశివరాత్రికి మూడు రోజులు నిర్వహించే జాతరకు భక్తులు భారీగా తరలివస్తారు.
పురాతన చరిత్ర
మూడు శతాబ్దాల క్రితం మామడ మండలం బూ ర్గుపల్లి నుంచి వేములవాడ ప్రయాణంలో ఇక్కడ పరమశివుడు పాదం మోపి స్వయంభూ లింగం ఆవిర్భవించాడని స్థానికుల నమ్మకం. రాజన్న ప టేల్ కలలో దేవుడు తోటలో ఉంటానని చెప్పడంతో గ్రామవాసులు బండరాయి కింద లింగాన్ని క నుగొన్నారు. అప్పటి నుంచి శివరాత్రి కల్యాణో త్సవంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
జాతర విశేషాలు
ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో మూడు రోజులు జాతర జరుగుతుంది. ఆదివారం సాయంత్రం భక్తులు ఉపవాసంతో జాగరణ చేసి, సోమవారం సహజవాగుల్లో పుణ్యస్నానం చేస్తారు. రాత్రి రథోత్సవంలో పాల్గొంటారు. మంగళవారం ప్రత్యేక పూజలతో వేడుకలు ముగుస్తాయి.
ప్రత్యేక ఆచారాలు
కోరికలు తీరిన భక్తులు తదుపరి శివరాత్రికి బెల్లం, కోడెలు కానుకలు సమర్పిస్తారు. ఇలాంటి ఆచారం ఉన్న రెండో ఆలయం ఇది. మొదటిది వేములవాడ ఆలయం. రెండు రోజులు ఉపవాస జాగారణలు ప్రత్యేకత. నిర్మల్, నిజామాబాద్, వరంగల్, ఆదిలా బాద్, మహారాష్ట్రల నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
శ్రీరాజా రాజేశ్వరస్వామి వారి దేవాలయం
రెండో వేములవాడ బాబాపూర్
రెండో వేములవాడ బాబాపూర్
రెండో వేములవాడ బాబాపూర్


