నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 8లోu ● ఎమ్మెల్సీ మల్క కొమురయ్యకు తపస్‌ వినతి

రబీ 2024–25 సీజన్‌కు సంబంధించి ఓ మిల్లుకు 5802.360 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అప్పగించగా, 27 శాతం సీఎంఆర్‌ మాత్రమే అప్పగించారు. వందశాతం పూర్తి చేయకున్నా.. 2025–26 ఖరీఫ్‌ సీజన్‌లో మళ్లీ 3834.520 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించారు. ఇప్పటివరకు 20 శాతం బియ్యమే అప్పగించారు.

మరో మిల్లుకు 2024–25 రబీ సీజన్‌లో 5262.600 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించగా, 34 శాతం సీఎంఆర్‌ అప్పగించారు. ఇక్కడా వందశాతం లక్ష్యం చేరకపోయినా.. 2025–26 ఖరీఫ్‌లో 3027.920 మెట్రిక్‌టన్నులు ధాన్యం అప్పగించారు. ఈ సీజన్‌కు సంబంధించి సదరు మిల్లు నిర్వాహకులు ఇప్పటివరకు గింజ బియ్యం కూడా అప్పగించలేదు.

న్యూస్‌రీల్‌

13 మిల్లులు బియ్యం గింజ అప్పగించలే..! జిల్లాలో సీఎంఆర్‌ తీరు ఇదీ ఇప్పటికే 34 మిల్లులపై కేసులు

వలస కార్మికులకు భరోసా
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఆర్‌పీఎల్‌ ఆధారిత డేటాబేస్‌ అమలు చేస్తున్నారు. నైపుణ్యాల ఆధారంగా సర్టిఫికెట్లు అందిస్తున్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

నిర్మల్‌ రూరల్‌: హైదరాబాద్‌లోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో రెండు రోజులపాటు జరిగిన తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారంపై తీ ర్మానం చేశారు. జిల్లా తపస్‌ నాయకులు ఎమ్మెల్సీ మల్క కొమురయ్యను శుక్రవారం కలిసి స మస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రతినిధులు శశిరాజ్‌, రాజేశ్వ ర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏ ఏరియర్స్‌, పెండింగ్‌, రిటైర్మెంట్‌ బకాయిల చెల్లించే విధంగా చూడాలని కోరారు. సీపీఎస్‌ రద్దు, కొన్ని నలుగుతున్న 317 సమస్య, కేజీ బీవీ ఎస్‌ఎస్‌ఏ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

భైంసాటౌన్‌: జిల్లాలో సీఎంఆర్‌ ప్రక్రియ ప్రహసనంగా మారింది. ప్రభుత్వం ఏటా రైతుల నుంచి ధాన్యం సేకరించి రైస్‌మిల్లర్లకు అప్పగిస్తోంది. అయితే, కొందరు మిల్లర్లు మాత్రం ఈ ప్రక్రియను అక్రమ సంపాదనకు వినియోగించుకుంటున్నారు. మిల్లింగ్‌ చేయకుండా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క బియ్యం గింజ కూడా అప్పగించకుండా బిచానా ఎత్తేసినవారూ ఉన్నారు. అయినా.. అధికారుల తీరు మారడం లేదు. సరైన నిఘా వ్యవస్థ లేక, ధాన్యం మాయమవుతూనే ఉంది.

13 మిల్లుల్లో జీరో..!

జిల్లాలో 2025–26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 13 మిల్లుల నుంచి ఇప్పటి వరకు ఒక్క బియ్యం గింజ కూడా అప్పగించలేదు. మరో ఏడు మిల్లులు 3, 5, 7, 9, 12 శాతం మాత్రమే బియ్యం అప్పగించాయి. జిల్లాలో పలువురు రైస్‌మిల్లర్లు గత సీజన్లకు సంబంధించి బియ్యం సకాలంలో అప్పగించకపోవడంతో ఈసారి అధికారులు 29 రైస్‌మిల్లులకు మాత్రమే 2025–26 ఖరీఫ్‌ ధాన్యం కేటాయించారు. ధాన్యం అప్పగించి దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. అయినా ఇప్పటివరకు మొత్తం సీఎంఆర్‌ 20 శాతం కూడా దాటలేదు. 2022–23 నుంచి 2025–26 ఖరీఫ్‌ సీజన్ల వరకు బియ్యం అప్పగించని 34 మిల్లులపై అధికారులు కేసులు నమోదు చేశారు. అయినా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. సంబంధిత అధికారులు సైతం ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీఎంఆర్‌ అప్పగించకున్నా ధాన్యం..

ఒక సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌ సకాలంలో పూర్తి చేయకుండానే అధికారులు మరో సీజన్‌ ధాన్యం కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది. మిల్లర్లు సైతం ఒక సీజన్‌లో వందశాతం సీఎంఆర్‌ పూర్తి చేస్తూ.. మరో సీజన్‌లో ధాన్యం కేటాయించుకుంటున్నారు. ఆ తరువాత ధాన్యం పక్కదారి పట్టించి, నిండా ముంచుతున్నారు. అధికారులు తీరిగ్గా తేరుకుని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. రూ.వందల కోట్లలో ప్రభుత్వ ధాన్యం మాయమవుతున్నా.. సరైన చర్యలు లేవన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, ధాన్యం పక్కదారి పడుతున్న విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, రోజంతా మిల్లుల వద్ద కాపలా ఉంటామా.. అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

జిల్లాలోని ఓ మిల్లులో ధాన్యం లారీ

2025–26 ఖరీఫ్‌ సీఎంఆర్‌ ఇలా..

సీఎంఆర్‌ మిల్లులు 29

కేటాయించిన ధాన్యం 59,396 మెట్రిక్‌ టన్నులు

అప్పగించాల్సిన బియ్యం

39,910.159 మెట్రిక్‌ టన్నులు

అప్పగించిన బియ్యం

7900.589 మెట్రిక్‌ టన్నులు

జీరో సీఎంఆర్‌ మిల్లులు 13

20 శాతంలోపు అప్పగించినవి 11

20 శాతంపైగా అప్పగించినవి 05

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement