ఈ ఫొటో చూడగానే పచ్చని మైదానం ఎంత బాగుందో అనుకుంటున్నారా.. కానీ మీరు తప్పులో కాలేసినట్లే.. ఇది బాసర శ్రీజా సరస్వతీదేవి పవిత్ర పుష్కరిణి. అధికారుల నిర్లక్ష్యంతో అందులోని నీరు ఇలా పాకురుపట్టింది. ఇక పారిశుద్ధ్య సిబ్బంది చెత్తాచెదారం కోనేరులోనే వేస్తున్నారు. అక్కడే నిప్పు పెడుతున్నారు. పొగతో ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఏటా పుష్కరిణిని గంగపుత్రులతో శుభ్రంచేయించేవారు. గతేడాది డబ్బులు చెల్లించకపోవడంతో గంగపుత్రులు శుభ్రంచేసేందుకు రావడం లేదని తెలిసింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్


