పార్టీని బలోపేతం చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్‌గౌడ్ సూచించారు. నిర్మల్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అధ్యక్షతన స్థానిక రాజరాజేశ్వర గార్డెన్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌గౌడ్ మా ట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలన్నారు. పనిచేసే వారికే పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. పార్టీ పరంగా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావా లని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ పర్యవేక్షకులు అవేజ్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు, కార్యక్తలు పాల్గొన్నారు.


