మందులు అందుబాటులో ఉంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా డ్రగ్ స్టోర్‌లో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గోపాల్‌సింగ్ సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్‌ను శుక్రవారం పరిశీలించారు. అవసరమైన మందులను ఉమ్మడి జిల్లా మెయిన్ డ్రగ్ స్టోర్ నుంచి లేదా రాష్ట్రం నుంచి ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని సూచించారు. వారివెంట నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డాక్టర్ సునీల్ సిబ్బంది పాల్గొన్నారు.
పాలీసెట్‌కు ఏర్పాట్లు
నిర్మల్‌ఖిల్లా: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష పాలిసెట్– 2025కు జిల్లాలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.రమేశ్ తెలిపారు. ఈనెల 13న జిల్లా కేంద్రంలోని 8 పరీక్ష కేంద్రాల్లో 2,422 మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సోఫీ నగర్ గురుకుల కళాశాల, వశిష్ఠ డిగ్రీ కాలేజ్, వశిష్ఠ జూనియర్ కాలేజ్, దీక్ష డిగ్రీ కాలేజ్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు హెచ్‌బీ పెన్సిల్, బాల్‌పాయింట్ పెన్‌తో సకాలంలో హాజరు కావాలని సూచించారు. ఉదయం 11 నుంచి 1:30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.


