నీటిబొట్టుకూ ఓ లెక్క | - | Sakshi
Sakshi News home page

నీటిబొట్టుకూ ఓ లెక్క

Mar 23 2025 1:07 AM | Updated on Mar 23 2025 1:03 AM

ఉమ్మడి జిల్లాలో 2024–2025 ఫిబ్రవరి వరకు భూగర్భ జల శాఖ వివరాలు

జారీ చేసిన ఎన్‌వోసీలు 101

రిజిస్ట్రేషన్‌ ఫీజులు(వాల్టా, పరిశ్రమ,

మైనింగ్‌) రూ.15,12,448

విధించిన జరిమానాలు రూ.1,65,000

వసూలైన భూగర్భజల వినియోగ చార్జీలు

రూ.3,02,64,788

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

భూగర్భ జలాలను వాడుతున్న ఆయా సంస్థలు, యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఫ్లో మీటరు అమర్చుకోవాలి. ముందుగా యజమానులకు అవగాహన కల్పించి, తర్వాత నోటీసులు ఇచ్చి అవసరమైతే జరిమానా విధిస్తున్నాం.– జి.లావణ్య,

భూగర్భ జలశాఖ అధికారి, మంచిర్యాల

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగాన్ని భూగర్భ జల శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. గృహ, ప్రజావసరాలు మినహా వ్యా పార కేంద్రాల్లో ఇష్టారీతిన నీటి వినియోగం తగ్గించేలా ప్రతీ నీటిబొట్టుకు లెక్కగడుతూ ఆ మేరకు చా ర్జీలు వసూలు చేస్తోంది. కమర్షియల్‌ కేంద్రాలైన కంపెనీలు, పరిశ్రమల నుంచి వినియోగ చార్జీలు తీసుకునేలా 2023లోనే తీసుకొచ్చిన నూతన విధానం లో ప్రతీ 1కేఎల్‌(వెయ్యి లీటర్లు)కు రూపాయి చొప్పున వసూలు చేయనున్నారు. గతంలో వాల్టా చట్టం ప్రకారం నీటి వాడకం కోసం ధ్రువీకరణ పత్రం(ఎన్‌వోసీ)ని మూడేళ్లకోసారి పునరుద్ధరణ చేసేవారు. కొత్త నిబంధనల ప్రకారం ఎంత నీరు వాడితే అంత చార్జీ చేస్తూ ప్రతీనెల విద్యుత్‌ బిల్లు మాదిరిగానే నీటి బిల్లు ఆన్‌లైన్‌లో చెల్లించేలా సిద్ధం చేశారు. ప్రస్తుతం సింగరేణి, దేవాపూర్‌ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ నిబంధనలు అమలు అవుతున్నాయి.

ఫ్లో మీటర్లు బిగింపు..

నీటిని వాడుతున్న ఆయ సంస్థలు, కంపెనీలు కచ్చితంగా భూగర్భ జలాల వాడకంపై డిజిటల్‌ ఫ్లో మీటర్‌తో కూడిన టెలిమీటర్‌కు అనుసంధానం చేసుకోవాలి. ఈ ఫ్లో మీటరు ప్రతీ ఆరు గంటలకు ఎంత నీటిని వాడారో లెక్కించి ఆన్‌లైన్‌లోనే వివరాలు పంపిస్తుంది. దీంతో ప్రతీ నెల ఆయా సంస్థలు జల వాడకానికి తగినట్లుగా చార్జీలు చెల్లించాలి. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్‌ కాస్టుల్లో అమలవుతోంది. వీటితోపాటు సిమెంటు, ఇతర మైనింగ్‌ కంపెనీలు, నీరు అధికంగా వినియోగిస్తున్న సంస్థలకు ఆయా జిల్లాల భూగర్భ జల అధికారులు వెళ్లి తనిఖీ చేస్తూ ఫ్లో మీటర్లను బిగించుకునేలా చూస్తున్నారు. కొత్త విధానంపై ఇంకా చాలామందికి అవగాహన లేకపోవడం, డబ్బులు కట్టాల్సి వస్తుందని కొన్ని చోట్ల స్పందించడం లేదు.

వాడకమున్నా వసూళ్లు లేవు

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ఫంక్షన్‌ హాళ్లు, ప్రైవేటు తాగునీటి ప్లాంట్లు, కంపెనీలు, పరి శ్రమలు, ఖనిజ పరిశ్రమలు అనేకం ఉన్నాయి. యా జమాన్యాలు తమ బోర్‌వెల్స్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకు ని ఫ్లో మీటర్లు అమర్చుకోవాల్సి ఉంది. కానీ చాలా చోట్ల వ్యాపారులు ముందుకు రావడం లేదు. అనధి కారికంగానూ బోర్‌వెల్స్‌, పంపుసెట్లు, వాగులు, వంకలు, చెరువుల నుంచి నీటిని తోడేస్తున్నారు. ఎండాకాలంలో ఈ వాడకం తీవ్రంగా ఉంటుంది. ఒక్కో సంస్థ నిత్యం వేలాది లీటర్ల నీటిని వినియోగి స్తున్నా లెక్కాపత్రం లేకపోవడంతోపాటు వినియోగంపైనా అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అలాంటి చోట్ల అధికారులు వెళ్లి మొదట నోటీసులు ఇస్తున్నారు. కొంత గడువు ఇచ్చాక జరిమానా విధిస్తున్నారు. చాలా చోట్ల యాజమాన్యాలు ఈ నోటీసులను సైతం పట్టించుకోవడం లేదు.

భూగర్భ జలాల వినియోగంపై చార్జీలు

ఫ్లోమీటర్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు

వ్యాపార, వాణిజ్య సంస్థలకు నోటీసులు

క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement