నిర్మల్ టౌన్: బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆరాధ్య దైవం కాన్షీరామ్ అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు భూమేశ్ పేర్కొన్నారు. శనివారం కాన్షీరాం జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మా ట్లాడుతూ.. 15 శాతం ఉన్న అగ్రకులాలే దేశంలోని భూమి, సంపద, రాజకీయ అధికారాలను అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేడ్కర్ అడుగుజాడల్లో కాన్షీరాం ముందుకు సాగారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్లూరు సుధాకర్, రాజు, కుందూరు వినోద్, కత్తి శేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న ధర్మసమాజ్ పార్టీ నాయకులు