కబాబ్‌లో చికెన్‌ ముక్క తక్కువొచ్చిందని.. హోటల్‌ యజమానిని ఏం చేశారంటే!

Youth Attack Hotel Owner over Kabab Chicken Piece Issue in Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: చికెన్‌ కబాబ్‌లో ఒక ముక్క తక్కువ వచ్చిందని హోటల్‌ యాజమానిపై ఇష్టం వచ్చిన్నట్లు దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన బెంగళూరులోని కోణనకుంట పోలీసుస్టేషన్‌లో జరిగింది. బాబు అనే వ్యక్తి ఈశ్వరలేఔట్‌లో హోటల్‌ నడుపుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి అదే ప్రాంతానికి చెందిన అభి, మని అనే ఇద్దరు యువకులు రూ.120 చెల్లించి ఒక ప్లేట్‌ చికన్‌ కబాబ్‌ పార్శిల్‌ తీసుకెళ్లారు.

ఇంటికి వెళ్లి పార్శిల్ తెరిచి చూడగా అక్కడ  9 కబాబ్ పీస్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక ప్లేట్‌కు 10 ముక్కలు ఇస్తారు. దీంతో 9 ముక్కలు మాత్రమే ఉన్నాయంటూ గురువారం ఉదయం హోటల్‌ వద్దకు వెళ్లి  యజమానితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి గొడవ పెద్దదవడంతో.. బాబుపై ఇద్దరూ దాడికి దిగారు. యమజాని ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రగాయాలైన బాధితుడు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభి, మనులను  పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
చదవండి: హోటల్‌లో నాగుపాము హల్‌చల్‌.. భయంతో కస్టమర్ల పరుగులు

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top