ఒక్క ఎస్ఎంఎస్ తో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోండిలా?

You can check Petrol and Diesel price by sending SMS - Sakshi

గత కొంతకాలంగా పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ సామాన్య ప్రజానీకానికి చుక్కలు చూపిస్తున్నాయి. చమురు ధరలు ప్రతి రోజు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ క్రమంలో తమ వినియోగదారులకు తాజా ఇంధన రేట్లను తెలియజేయడం కోసం స్టేట్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎస్ఎంఎస్ సేవల ద్వారా దేశంలోని 41 ప్రాంతాలలో ఉన్న వినియోగదారులు క్షణాలలో మొబైల్‏లోనే రోజువారీ పెట్రోల్, డిజిల్ రేట్లను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

ఈ సేవలను పొందటానికి వినియోగదారుడు 9224992249 నెంబర్ కు కంపెనీ సూచించిన ఫార్మాట్‏లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ వెబ్ సైట్ నుంచి డీలర్ కోడ్ తెలుసుకోవాలి. ఉదా: హైదరాబాద్ - RSP 134483, విజయవాడ - RSP 127611, విశాఖపట్నం RSP 127290. ఇలా మీ ప్రాంత కోడ్ లను RSP 134483 అని టైపు చేసి 9224992249 నెంబర్ కు పంపించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ పంపిన తర్వాత మీ మొబైల్‏కు ఎస్ఎంఎస్ రూపంలో పెట్రోల్, డీజిల్ ధరలు పంపిస్తుంది. అయితే ఒక్కో నగరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వాటి వివరాలను ఇండియన్ ఆయిల్ తన వెబ్‏సైట్‏లో పొందుపర్చింది. దాదాపు 41 నగరాల్లో ఉన్న పెట్రోల్ పంప్ డీలర్ కోడ్‏ల జాబితాను క్రియేట్ చేసింది.

చదవండి:

కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా?

ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top