కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా? | Komaki MX3 electric motorcycle launched in India | Sakshi
Sakshi News home page

కోమకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా?

Mar 22 2021 5:43 PM | Updated on Mar 22 2021 5:46 PM

Komaki MX3 electric motorcycle launched in India - Sakshi

ప్రపంచం మొత్తం రోజు రోజుకి విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇక భారత్ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో భారత ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సిహిస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ మోటార్ ‌సైకిల్ తయారీ సంస్థ కోమకి ఎమ్ఎక్స్ 3 పేరుతో మార్కెట్ లోకి బైక్ ను లాంచ్ చేసింది. ఈ ఏడాది కోమకి లాంచ్ చేసిన నాలుగో ఎలక్ట్రిక్ బైక్ ఇది. ఎం5 తర్వాత తీసుకొచ్చిన కొమాకి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ఇది. 

కొత్తగా తీసుకొచ్చిన కోమకి ఎంఎక్స్ 3 బైక్ 17 అంగుళాల వీల్స్, టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్స్, పెద్ద వైడ్ సీటు కలిగి ఉంది. ఇది సింపుల్ స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. కోమాకి ఎంఎక్స్ 3లో రివర్స్ అసిస్ట్, రిజెనెరేటివ్ బ్రేకింగ్, త్రీ స్పీడ్ మోడ్స్, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ స్పీకర్, ఎల్‌ఇడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85-100 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. ఎంఎక్స్ 3 లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. 1.5 యూనిట్ల కరెంట్‌తో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుంది. దీని లి-అయాన్ బ్యాటరీని బయటకి కూడా తీసి ఛార్జ్ చేయవచ్చు. ఎంఎక్స్ 3 మూడు రంగులలో లభిస్తుంది.

చదవండి:

ప్రపంచంలో చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement