
యశవంతపుర: మాజీ సీఎం కుమారస్వామిని ఒక మహిళ ముద్దాడింది. పంచరత్న యాత్రలో భాగంగా హెచ్‌డీ కుమారస్వామి శనివారం యశవంతపురలోని మారుతీనగరలో పర్యటించారు. ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక మహిళా కార్యకర్త జీపు వెనుక నుంచి పైకెక్కి కుమారస్వామి బుగ్గపై ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.