షాకింగ్‌ : కోతిని తరమబోయి.. సజీవ దహనం! | While Chasing Monkey a man Electrocuted In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : కోతిని తరమబోయి.. సజీవ దహనం!

Apr 15 2026 7:29 PM | Updated on Apr 15 2026 8:12 PM

While Chasing Monkey a man Electrocuted In Madhya Pradesh

మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్‌లో  విషాదం చోటు చేసుకుంది. కోతులను తరమబోయి ఒక రిసార్ట్ ఉద్యోగి మరణించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్‌తో  అక్కడి కక్కడే మరణించాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసుల కథనం ప్రకారం, ఖజురహో రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రిసార్ట్ పైకప్పుపైకి కోతి వచ్చింది. దీంతో ఇనుప రాడ్‌తో కోతిని తరమడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో కోతిని భయపెట్టి, దాన్ని తరిమికొట్టడానికి రాడ్‌ను పైకి ఎత్తినప్పుడు, అది రిసార్ట్ పైకప్పుపై ఉన్న హై-వోల్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది. 33 kV హై-టెన్షన్ తీగ కావడంతో తీవ్రమైన విద్యుదాఘాతానికి రాను రైక్వార్‌  చనిపోయాడు. ఖజురహో నివాసి అయిన  రాను ఐదు రోజుల క్రితమే ఆ రిసార్ట్‌లో చేరాడు.

బమితా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం  తరలించారు. రిసార్ట్ పైకప్పుకు సమీపంలో హై-టెన్షన్ లైన్ ఉండటం నిబంధనలను ఉల్లంఘించిందా లేదా ఈ సంఘటన రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని బమితా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ వాల్మీకి చౌబే తెలిపారు. 

ఇదీ చదవండి: టీసీఎస్‌ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్‌

 రిసార్ట్ యజమాని జయ్ తివారీ మాట్లాడుతూ, కోతిని తరిమికొట్టే ప్రయత్నంలో ఈ విషాద సంఘటన జరిగింది. రిసార్ట్ పైనుంచి నేరుగా 33 కేవీ రైల్వే లైన్ వెళుతుంది. దానిని తరలించడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, రైల్వే అధికారులు తొలగించడానికి నిరాకరించారు. మృతుడికిను రైక్వార్‌కు ఇద్దరు చిన్న పిల్లలన్నారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement