VIRAL: ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో.. క్షణం ఆలస్యం అయ్యుంటేనా!

West Bengal: RPF Officer Saves Woman From Crushing Under Train Purulia Station - Sakshi

కదులుతున్న రైలు నుంచి ఇద్దరు మహిళలు ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి దూకారు. అందులో ఒకరు వేగంగా నడుస్తున్న రైలు కింద పడుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ చిరుతలా వేగంగా వచ్చి ఆమెను పక్కకు లాగాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. సంత్రాగచ్చి-ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ పురులియా స్టేషన్‌ గుండా వెళ్తున్న క్రమంలో ఓ పురుషుడు, తర్వాత ఇద్దరు మహిళలు ప్లాట్‌ఫామ్‌పై దూకేశారు.

దీంతో ఓ మహిళ రైలు కిందపడే సమయంలో.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బబ్లూ కుమార్‌ పరుగుత్తుకుంటూ వచ్చి ఆమెను కాపాడాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ వీడియో​ RPF Adra Division ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాహసం చేసి మహిళను కాపాడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బబ్లూ కుమార్‌పై రైల్వే అధికారులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top