Viral Video Of Huge Python Slithering Across Wall Horrifies Internet - Sakshi
Sakshi News home page

వామ్మో.. గోడ నుంచి ఇంట్లోకి దూరుతున్న కొండ‌చిలువ.. ఒళ్లు జలదరించే వీడియో

Oct 17 2022 5:48 PM | Updated on Oct 18 2022 5:37 PM

Viral Video Of Huge Python Slithering Across Wall Horrifies Internet - Sakshi

సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. నిత్యం ఫన్నీ, షాకింగ్‌, ఆశ్చర్యపరిచే  లక్షల వీడియోలు నెటిజన్లను దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని చూస్తే భయపడకుండా ఉండలేం! తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి కూడా. తాజాగా  అటువంటి ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

మెట్ల పక్కనున్న గోడపై  ఓ భారీ కొండచిలువ పాకుతూ పైకి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత నంద తన ట్విటర్‌లో పోస్టు చేశారు. పైకి వెళ్లడానికి ప్రతీసారి మెట్లు అవసరం లేదు’ అనే కాప్షన్‌తో షేర్‌ చేశారు. 32 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మెట్లకు ఆనుకుని ఉన్న రెయిలింగ్‌పై కొండచిలువ పాకుతూ ఇంటిపై అంతస్తులోకి వెళ్తుండటంకనిపిస్తోంది.

ఈ వీడియో చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ట్విటర్‌లో పోస్టు చేసిన గంటల్లోనే వైరల్‌గా మారింది. దీనికి వేలల్లో వ్యూస్‌ వచ్చాయి. అనేకమంది నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. కొండచిలువ ఎక్కుతుండటం చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుందని, వీడియో తీసిన వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలంటూ కామెంట్‌ చేస్తున్నారు. మీరు కూడా ఓసారి వీక్షించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement