అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్‌

Viral Video: Bride Refuses To Enter Her Wedding Venue - Sakshi

కొందరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియ‌దు. చిన్న చిన్న విష‌యాల‌కు కూడా కోపం తెచ్చుకోవడం, అలగడం లాంటివి చేస్తుంటారు. పక్కన వాళ్లు అలకకు కారణం తెలుసుకుని కాసేపు బుజ్జగించి, లాలించి కూల్‌ చేస్తే మళ్లీ మామూలు మూడ్‌లోకి వచ్చేస్తారు. సాధారాణంగా చిన్నపిల్లల దగ్గర ఇలాంటి చేష్టలు ఎక్కువగా చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి లక్షణాలే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ వధువు ప్రదర్శించి అందరికీ షాక్కిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో..  ఓవైపు అతిథులు వ‌చ్చారు, కాసేపట్లో ముహూర్త సమయం దగ్గర పడుతోంది అనగా ఓ పెళ్లి కూతురు నేను హర్ట్‌ అయ్యాను పెళ్లి మండ‌పం ఎక్క‌ను గాక ఎక్కును.. అంటూ చిన్న పిల్లలా మారాం చేయడంతో పాటు అలిగి బుంగమూతి పెట్టుకుంది. అసలు తను ఇలా ఎందుకు చేస్తోందని బంధువులు ఆరా తీయ‌గా.. అప్పుడు ఆ వధువు మండపంలోకి తన ఎంట్రీ ఉన్నప్పుడు ఆమె చెప్పిన పాట‌కు బదులు వేరే పాటను ప్లే చేశారని చెప్పింది.

ఈ విషయంపై ఆ ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్‌తో గొడ‌వ కూడా పడింది. నేను ముందే చెప్పాను క‌దా.. ఆ పాట ప్లే చేయ‌మ‌ని. అందుకే హర్ట్‌ అయ్యాను, నేను అస‌లు పెళ్లిమండ‌ప‌మే ఎక్క‌ను.. అంటూ అంద‌రినీ ఇబ్బంది పెట్టింది ఆ పెళ్లికూతురు. చివ‌ర‌కు వధువు కుటుంబ స‌భ్యులు బతిమలాడి, ఓదార్చడంతో బుంగమూతి పక్కన పెట్టి పెళ్లి పీట‌లు మీద కూర్చింది. ది వెడ్డింగ్‌ బ్రిగేడ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ  వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇది చూసిన నెటిజనులు మాత్రం నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top