Veerappan Elder Brother Mathaiyan Passed Away With Cardiac Arrest - Sakshi
Sakshi News home page

వీరప్పన్‌ సోదరుడు మత్తయ్యన్‌ కన్నుమూత.. 34 ఏళ్లుగా జైలులోనే..!

Published Wed, May 25 2022 10:04 AM

Veerappan Elder Brother Mathaiyan Passed Away With Cardiac Arrest - Sakshi

చెన్నై: గంధపుచెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ పెద్దన్న మత్తయ్యన్‌(75) కన్నుమూశాడు. గుండెపోటుతో సేలం(తమిళనాడు) ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. 

మత్తయ్యన్‌.. ఓ హత్య కేసులో సేలం సెంట్రల్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మే 1న తీవ్ర గుండెపోటు రావడంతో పోలీసులు, మోహన్‌ కుమారమంగళం మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. 

1987లో ఫారెస్ట్‌ రేంజర్‌ చిదంబరంను హత్య చేసిన కేసులో.. ఈరోడ్‌ జిల్లా బంగ్లాపూడుర్‌ పోలీసులు మత్తయ్యన్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో జీవిత ఖైదు పడగా.. 34 ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. ఈయన్ని విడుదల చేయాలంటూ పలు పిటిషన్లు సైతం తెర మీదకు వచ్చాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement