Vedant Deoakte: అమెరికాలో రూ.33 లక్షల ఉద్యోగం కోల్పోయిన బాలుడు 

Vedant Deoakte: Coding Contest winner Loses Offer For Being Too Young - Sakshi

ముంబై:  కోడింగ్‌ కాంపిటీషన్‌లో 1,000 మందితో పోటీపడి నెగ్గిన విజేతకు అమెరికా కంపెనీ మంచి ఉద్యోగం ఆఫర్‌ చేసింది. ఏడాదికి రూ.33 లక్షల వేతనం ఇస్తామని తెలిపింది. అతడి వయసు గురించి తెలిశాక ఉద్యోగం ఇవ్వలేమని సమాచారం పంపింది. విజేత వయసు కేవలం 15 ఏళ్లు కావడమే ఇందుకు కారణం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన వేదాంత్‌ దేవ్‌కాటే వయసు 15 సంవత్సరాలు.

పదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్‌టాప్‌ సాయంతో స్వయంగా కోడింగ్‌ నేర్చుకున్నాడు. అందులో మంచి పట్టు సంపాదించాడు. అమెరికాలోని న్యూజెర్సీ అడ్వర్‌టైజింగ్‌ కంపెనీ నిర్వహించిన కోడింగ్‌ పోటీలో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో 2,066 లైన్ల కోడ్‌ రాశాడు. సునాయాసంగ విజయం సాధించాడు. వేదాంత్‌ ప్రతిభను గుర్తించిన న్యూజెర్సీ అడ్వర్‌టైజింగ్‌ కంపెనీ తమ మానవ వనరుల విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

రూ.33 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తామని తెలిపింది. వ్యక్తిగత వివరాలు పంపాలని కోరింది. వేదాంత్‌ ఆ వివరాలు పంపించాడు. అతడి వయసు 15 ఏళ్లేనని తెలుసుకున్న న్యూజెర్సీ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేమని పేర్కొంది. తమ కంపెనీ నిబంధనల ప్రకారం చిన్న వయసు వారిని చేర్చుకోవడం సాధ్యపడదని నిస్సహాయత వ్యక్తం చేసింది. నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తమను సంప్రదించాలని వేదాంత్‌కు సూచించింది.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top